Header Banner

మహిళల జీన్స్ పాకెట్స్ మగవారి కంటే ఎందుకు చిన్నవిగా ఉంటాయో తెలుసా.? నిజం తెలిస్తే ఆశ్చర్య పోవడం పక్కా!

  Tue Apr 08, 2025 15:56        Life Style

వయస్సుతో సంబంధం లేకుండా మగవారైనా, ఆడవారైనా జీన్స్‌ను స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా వేసుకుంటున్నారు. అయితే, పురుషుల జీన్స్ పాకెట్లకు పెద్ద డెప్త్ ఉండగా, మహిళల జీన్స్‌లో పాకెట్లు చాలా చిన్నవిగా ఉంటాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అసలేం జరిగిందీ? ఈ డిజైన్ వెనుక కథేంటి? జీన్స్ మొదటగా అమెరికాలో పని చేసే వర్గం కోసం రూపొందించబడింది. ముఖ్యంగా పురుషుల శ్రమకు అనుగుణంగా మన్నికైన, ఉపయోగకరమైన దుస్తులుగా ఇవి పుట్టుకొచ్చాయి. పనిలో అవసరమైన సాధనాలు పెట్టుకోవడానికే పురుషుల జీన్స్‌కు లోతైన పాకెట్లు ఇవ్వబడ్డాయి. అదే సమయంలో, ఆ రోజుల్లో మహిళలు ప్రధానంగా ఇంటి పనుల్లోనే ఉండే పరిస్థితి ఉండేది. కాబట్టి వారికింకా జీన్స్ అవసరం అనిపించలేదు. కాస్త కాలం గడిచే సరికి మహిళలు కూడా జీన్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ, పురుషుల కోసం రూపొందించిన ఫంక్షనల్ డిజైన్ మహిళల ఫ్యాషన్‌కు నప్పదని భావించి, మహిళల కోసం ప్రత్యేక డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఫిట్‌నెస్, స్టైల్, ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మహిళల శరీర నిర్మాణం, డ్రెస్ ఫిట్టింగ్, డీప్ పాకెట్లు ఉండటంతో వారి బాడీ షేప్ డిస్టర్బ్ అవుతుందని ఫ్యాషన్ డిజైనర్లు అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: ముదురుతోన్న వాణిజ్య యుద్ధం.. చైనాకు ట్రంప్ మరో వార్నింగ్.. 24 గంటల డెడ్ లైన్!

 

ముఖ్యంగా స్కిన్నీ జీన్స్, టైట్ ఫిట్ జీన్స్ వంటి ట్రెండీ స్టైల్‌లలో పెద్ద పాకెట్లు జీన్స్‌ను అపాకర్షణీయంగా చేస్తాయని చెబుతున్నారు. దీంతో మహిళల జీన్స్‌లో పాకెట్లు కేవలం డిజైన్ పరిమితంగా ఉండిపోయాయి. అలాగే, చిన్న పాకెట్ల కారణంగా మహిళలు తప్పనిసరిగా హ్యాండ్‌బ్యాగ్ లేదా పర్సు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా ఒక రకంగా ఫ్యాషన్ ప్రమోషన్‌గానే మారిపోయింది. ఫ్యాషన్ & మార్కెటింగ్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే – ‘‘పాకెట్లను చిన్నవిగా చేసి, అమ్మాయిలను స్టైలిష్ బ్యాగ్స్‌కి అట్రాక్ట్ చేయడమే’’ ప్రాథమిక ఉద్దేశమట.. ఇప్పటిలో చాలామంది అమ్మాయిలు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ధరిస్తున్నారు. అవి బాడీని బాగా చుట్టేసేలా ఉంటాయి. అయితే ఇలా గట్టిగా టైట్ ఫిట్టింగ్ ఉన్న జీన్స్ ధరించడం వల్ల చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తప్రసరణ సరిగా జరగక, నరాలపై ప్రెషర్ పడుతుంది. దీంతో వాపులు, చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వంటి వాటికి దారి తీయవచ్చు. మరికొందరికి సంతాన సంబంధిత ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అయితే కొంత మార్పు కనిపిస్తోంది. ఫంక్షనల్ జీన్స్ డిజైన్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. డీప్ పాకెట్లు ఉండే జీన్స్ మోడల్స్ మహిళల కోసం అందుబాటులోకి వస్తున్నాయి. డ్రెస్సుల్లోనూ పాకెట్లను జోడించడం ఫ్యాషన్‌గా మారింది. స్టైల్‌తోపాటు ఉపయోగకారతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫ్యాషన్ వేటలో ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టొద్దు. స్టైల్ కంటే సౌలభ్యం, ఆరోగ్యం ముఖ్యం. జీన్స్ ఎంచుకోవడంలో స్మార్ట్‌గానూ, సేఫ్‌గానూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #womensJeans #SmallPockets #Mensjeans #Lifestyle #ViralNews